Discover
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

2680 Episodes
Reverse
నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయనిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై ‘న’ కారాయ నమ: శివాయ 1 మందాకినీ సలిల చందన చర్చితాయనందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయమందార పుష్ప బహుపుష్ప సుపూజితాయతస్మై ‘మ’ కారాయ నమ: శివాయ 2 శివాయ గౌరీ వదనాబ్జ బృందసూర్యాయ దక్షాధ్వర నాశకాయశ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయతస్మై ‘శి’ కారాయ నమ: శివాయ 3 వశిష్ఠ కుంభోద్భవ గౌతమాదిమునీంద్ర దేవార్చిత శేఖరాయచంద్రార్క వైశ్వానర లోచనాయతస్మై ‘వ’ కారాయ నమ: శివాయ 4 యక్ష స్వరూపాయ జటాధరాయపినాక హస్తాయ సనాతనాయదివ్యాయ దేవాయ […]
సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం |సత్యస్య యోనిం నిహితంచ సత్యే ||సత్యస్య సత్యమ్ ఋత సత్య నేత్రం |సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నా: || ధ్వాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితమ్ |లోకనాధం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిమ్ ||పాతాంబరం నీలవర్ణం శ్రీ వత్సపద భూషితమ్ |గోవిందం గోకులానందం బ్రహ్మేద్వైరభిపూజితమ్ ||
శ్లో|| స్ఫురత్ సహస్రార శిఖా తితీవ్రంసుదర్శనం భాస్కర కోటి తుల్యమ్|సురద్విషాం ప్రాణవినాశి విష్ణో:చక్రం సదాహం శరణం ప్రపద్యే|| తాత్పర్యము : రంపమునకు చివర సూదిగ ముళ్ళవలె నుండు పదునైన భాగమును ‘ఆకు’ లేక ‘అర’ అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్రిశిఖలను క్రక్కుచూమిరుమిట్లు గొలుపు కాంతులీను ఓ ”సుదర్శన చక్రమా!” ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళవిగ్రహము కల్గి, దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు, కోట్ల సూర్యులుదయించినపుడు ఉండెడి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది. […]
ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తాం ||సకల భువన నేత్రం నూ త్నరత్నోపధేయంతిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీ నాంసురవరమభి వంద్యం, సుందరం, విశ్వరూపం || – లంకే రామగోపాల్
శ్లో|| గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసం తార్యక్షమారుహ్య ధావన్వ్యాఘూర్ణన్ మాల్యభూషా వసన పరికరో మేఘ గంభీర ఘోష:ఆబిభ్రాణో రంథాంగం శరమసి మభయం శంఖ చాపౌ సఖేటౌహస్తై: కౌమోదకీ మప్యవతు హరి రసావంహసాం సంహతేర్న:|| తాత్పర్యము : గజేంద్రుడు ఒకనాడు ఒక మడుగులో మొసలిచే పట్టబడినాడు. బయటపడుటకు ఎన్నిరకములుగా ప్రయత్నించినను విఫలుడాయెను. ”నీవే దిక్కని” భగవానుని ఆక్రోశించెను. అది చెవిసోకిన వెంటనే తీవ్ర ఆర్భాటముతో గరుడినిపై అధిరోహించి ఆతనిని నడుపుకొనుచు దొర్లుకొంటూ తిరుగుతూ పరుగిడి ఆ భగవానుడు దిగెను. […]
నమామి ధన్వంతరి మాదిదేవంసురాసురైర్వందిత పాదపద్మం లోకేజరారుగ్భయ మృత్యునాశంధాతారమీశం వివిధౌషధీనాం.. – లంకే రామగోపాల్
నమ్మకము అంటే ఆత్మవిశ్వాసం మరియు వినయం సమ్మిళితం. నమ్మకం చెబుతుంది ‘సరిఅయిన విత్తనం నాటండి సరి అయిన ప్రయత్నం చేయడం’ కానీ విషయాలు ఎలా జరగాలో అలా జరుగుతాయి. నమ్మకం అంటే సకారాత్మకంగా ఉండటం కాదు, ఏదో ఒకటి అనుకోని కర్మ చేయడం, సహనాన్ని కలిగి ఉండటం, జీవిత నాటకంపై నమ్మకంతో దానిని ఉంచడం కర్మ యొక్క ఫలితంతో అతీతముగా ఉండడం. ఈ రోజు నేను నమ్మకంగా ఉంటాను. – బ్రహ్మాకుమారీస్వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి
పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామనుజాచార్యుల వారి వివరణ… 28.సకల భువన మధ్యే నిర్ధనాస్తేపి ధన్యా:నివసతి హృదియేషాం శ్రీహరే: భక్తిరేకాహరి రపి నిజలోకం సర్వధాతో విహాయప్రవిశతి హృది తేషాం భక్తి సూత్రోప నద్ధ: అఖిలాండ కోటి బ్రహ్మాండములలో, అన్ని లోకములలో హృదయమున శ్రీహరి యందు భక్తి కలవారు ధన హీనులైనా ధన్యులే. శ్రీహరి కూడ తనలోకమును పూర్తిగా విడిచి పెట్టి భక్తి సూత్రముతో కట్టబడి వారి హృదయంలో ప్రవేశించును. ధన్యా అన్న శబ్ధమునకు ధనము కలవారు […]
మానవ శరీరంలో లోపాలుంటే, శ్వాస, మాట మరియు నడవటంలో ఇబ్బందులు పడవలసి వస్తుంది. శారీరక బాధలు ఉండటం వలన ఆందోళన, ఒత్తిడి పెరిగి చివరికి వ్యాధిగా మారుతుంది. అదే విధముగా స్వయంతో సత్యత ఇమడకపోతే ఆధ్మాత్మిక శక్తిని కోల్పోయి మన జీవితంలో అసంతృప్తిని , అసౌకర్యాన్న అనుభ వం చేస్తాము. ‘నేను ఎవరిని ‘ – ‘శరీరం లోపల ఉన్న ఆధ్మాత్మిక శక్తిని’ అలా మనం సత్యత మనలో ఇముడ్చుకున్నప్పుడు, మనం శక్తివంతులం, ఆరోగ్యవంతులం అవుతాము. ఈ […]
పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామనుజాచార్యుల వారి వివరణ… 27.దు:ఖ దారిద్య్ర దౌర్భాగ్య పాప ప్రక్షాళనాయ చకామ క్రోధ జయార్ధం హి కలౌ ధర్మోయమీరిత: దు:ఖము, దారిద్య్రము, దౌర్భాగ్యము, పాపము ఇవి తొలగించుకోవాలనుకునే వారు కామమును, క్రోధమును జయించాలి. అందుకనే వారు కలియుగమున శ్రీ మద్భాగవతమును సేవించుటే ధర్మముగా తలచవలెను. పూర్వ జన్మలో చేసిన పాపములే దు:ఖమును, దారిద్య్రమును, దౌర్భాగ్యమును కలిగించును. పాపం వలనే వ్యాధులు సంభవించును. వ్యాధుల వలన దు:ఖము కలుగును. పాపం చేయుట […]
బాహ్య శక్తుల కంటే లోపలి శక్తిని బలమైనదిగా చేయండి. నేటి ప్రపంచంలో పరిస్థితులు, పర్యావరణం, వాతావరణం ఇలా అనేక రకాలుగా మనం ప్రభావితం అవుతాము, కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావంతో చెప్పలేనివి, చేయకూడనివి చేస్తాము. అయితే బాహ్య వాతావర ణాన్ని నిందించే కన్నా మనలో ఉన్న శక్తిని బాహ్య పరిస్థితుల కన్నా అధికంగా, శక్తివంతంగా పె ంచుకోవచ్చును. నా అంతరంగము లోపలికి నేను విధి పూర్వకముగా దృష్టి కేంద్రీకరించి ప్రతిసారీ నాలోని శక్తి పెరుగుతుంది. ఈ రోజు నా […]
పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామనుజాచార్యుల వారి వివరణ…25జీవచ్ఛవో నిగదిత: సతుపాపకర్మాయేనశ్రుతం శుక కధా వచనం న కించిత్ధిక్తం నరం పశు సమం భువి భార రూపమ్ఏవం వదంతి దివి దేవ సమాజ ముఖ్యా: పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఒక్కసారైనా భాగవత కధను విననివాడు బ్రతికి ఉండి కూడ మరణించిన వానితో సమానం. అటువంటి వారు నర రూపంలో ఉన్న పశువు, భూమికి బరువైన వాడని స్వర్గంలో దేవతలు చెప్పుచున్నారు. – శ్రీమాన్ డాక్టర్ […]
అధ్యాయం 2, శ్లోకం 6262ధ్యాయతో విషయాన్ పుంస:సంగస్తేషూపజాయతే |సంగాత్ సంజాయతే కామ:కామాత్ క్రోధో భిజాయతే || తాత్పర్యము : ఇంద్రియార్ధములను ధ్యానించునపుడు వాని యెడ మనుజునికి ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి నుండి కామము వృద్ధినొందగా, కామము నుండి క్రోధము ఉద్భవించును. భాష్యము : కృష్ణచైతన్యము లేనప్పుడు మనస్సు ఇంద్రియ భోగము(ను) ధ్యానించినట్లయితే భౌతిక కోరికలు ఉదయిస్తాయి. ఇంద్రయములకు సరైన కార్యములు ఉండవలెను. భగవంతుని సేవలేనిదే భౌతికమైన వాటిలో అవి నిమగ్నమవుతాయి. దీనికి బ్రహ్మ, శివుని వంటి […]
మీ జీవితం సత్యత యొక్క ప్రతిబింబంగా చేయండి. మనలోని అత్యున్నతమైన సత్యత ఆధారంగా జీవితాన్ని జీవించాలని ఎంచుకున్నప్పుడు. మనకు సవాళ్ళు వస్తాయని అనుకోవచ్చు. బాహ్య ప్రతిపక్షము నుంచి అడ్డంకులు, ఊహించని ఇబ్బందులు అలాగే కొన్నిసార్లు అంతర్గత భావోద్వేగాల ఒడిదుడుకులు మరియు ఒత్తిడి రూపంలో కూడా అవి ఉంటాయి. అయితే మనం ఈ తుఫానులను నిభాయించుకుంటామని నిర్ణయించుకున్నప్పుడు, స్వయంలో అత్యున్నత సత్యత యొక్క స్కృతి ఉన్నప్పుడు దాని ఫలితంగా నిశ్చిత విజయం ఉంటుంది. ఈ రోజు ఉన్నతమైన సత్యత […]
పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ… 24.ఆజన్మ మాత్రమపి యేన శఠేన కించిత్చిత్తం విధాయ శుక శాస్త్ర కధా నపీతాచండాలవచ్చ ఖరవత్ బతతేన నీతమ్మిధ్యా స్వజన్మ జననీ నిజ దు:ఖ భాజా పుట్టినప్పటి నుంచి మరణించే లోపల ఒక్కసారైనా మనస్సు పెట్టి శుక శాస్త్రమైన భాగవత కథను వినని వాడు తన బ్రతుకును ఒక జంతువుగా, మూర్ఖునిగా వెళ్లదీసిన వాడగును. తన పుట్టుక కూడా తల్లికి ప్రసవ వేదనను, తనకు పుట్టుక వేదనను […]
అధ్యాయం 2, శ్లోకం 6161తాని సర్వాణి సంయమ్యయుక్త ఆసీత మత్పర: |వశే హి యస్యేంద్రియాణితస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || తాత్పర్యము : ఇంద్రియములను పూర్ణముగా నియమించి వానిని వశము నందుంచుకొని నా యందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థితప్రజ్ఞుడనబడును. భాష్యము : యోగములో పరిపూర్ణత్వస్థితి కృష్ణచైతన్యమేనని ఈ శ్లోకము నందు వివరించుట జరిగినది. కృష్ణచైతన్యవంతులు కానిదే ఇంద్రియములను నిగ్రహించుట సాధ్యము కాదు. గొప్ప యోగి అయిన దుర్వాసముని అంబరీష మహారాజుతో తగాదా పెట్టుకుని కోపోద్రిక్తుడై గర్వముతో […]
మనం అన్ని సమయాలలో భౌతికంగా చరుకుగా ఉండటంతో అది నిశ్చలంగా కుర్చోలేక అసౌకర్యపు లక్షణంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎప్పటికీ కూర్చుని ఉంటేఉ జడత్వం వైపు దారి తీస్తుందేమో అనే భయం వల్ల కదులుతూనే ఉండాలనరే బలవంతం వల్ల, నిశ్చలత మరియు నిశ్శబ్దమును నివారించేందుకు మనం చేసే ప్రయత్నం లాగా అనిపిస్తుంది. ఈ బలవంతాన్ని అధిగమించాలని ఎంచుకుంటే, నిశ్చలంగా అయి ఆలోచించండి మరియు నిశ్శబ్దము అనుభవం చేయండి. జీవితం మన సొంతముగా, మనం దానికి పూర్తి యజమాని అనే […]
పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…22శ్లోకార్థం శ్లోక పాదం వా నిత్యం భాగవతోద్భవంపఠస్వ స్వముఖే నైవ యదీచ్ఛాసి పరాంగతిమ్ ఉత్తమ గతిని అనగా వైకుంఠమును పొందగోరిన వారు ప్రతి దినము భాగవతంలోని ఒక శ్లోకం కానీ, సగం శ్లోకం కానీ, పావు శ్లోకం కానీ నీ నోటి తోటే నీవు చదువుము. భాగవతంలో పద్దెనిమిదివేల శ్లోకాలు కలవు. ఇవి చదవడానికి మన జీవితం సరిపోతుందా, చదివినా అర్థం తెలియకుంటే ప్రయోజనం ఏమిటి? సామాన్యులకు […]
పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…21.న గంగా న గయా కాశీ పుష్కరం న ప్రయాగ కంశుక శాస్త్ర కధాయాశ్చ ఫలేన సమతాం నయేత్ గంగా, గయా, కాశీ, పుష్కరం, ప్రయాగ ఈ పుణ్యతీర్థములన్నీ భగవంతుని కథలను బోధించిన భాగవతంతో సమానమైన ఫలమును ఈయజాలవు.పుణ్య తీర్థములలో కేవలం తీర్థములు, తీర్థములను సేవించిన వారే ఉందురు. కాశీ మొదలగు పుణ్యక్షేత్రములలో ఆ పుణ్య క్షేత్రములు వాటిని సేవించే భక్తులు మాత్రమే ఉంటారు. కానీ భాగవతంలో […]
పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ… 20.తావత్ పాపాని దేహేస్మిన్ నివసంతి తపో ధనా:యావన్ నశ్రూయతే సమ్యక్ శ్రీమత్ భాగవతం నరై: శ్రీమత్ భాగవత కథను విననంత వరకే మానవుల దేహములో పాపాలు నివసిస్తుంటాయి. భాగవత కధ వినిన వెంటనే అన్ని పాపాలు నశిస్తాయి అని భావము. పాపము అంటే పరమాత్మ కోపము, పుణ్యము అంటే పరమాత్మ సంతోషము. పరమాత్మ చెప్పిన వేద శాస్త్రములను అందులో చెప్పిన విధులను ఆచరించ నందున పరమాత్మ […]
This is very good!